జనగళం https://janagalam.com Telugu News updates Fri, 08 Mar 2024 12:15:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://i0.wp.com/janagalam.com/wp-content/uploads/2025/01/cropped-jg-2.jpg?fit=32%2C32&ssl=1 జనగళం https://janagalam.com 32 32 198900626 టీడీపీతో జత కట్టేందుకు సై అంటున్న బీజేపీ – తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు | BJP with TDP https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%a4-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8/ https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%a4-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8/#respond Fri, 08 Mar 2024 12:15:06 +0000 https://janagalam.com/?p=1910

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఓటమి భయం వణికిస్తోంది. భారతీయ జనతా పార్టీ టీడీపీ, జనసేనకు దగ్గర కావడంతో తాడేపల్లి వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. చంద్రబాబు వైపు కమలనాథులు మొగ్గు చూపడం దాదాపుగా ఏపీలో వైసీపీ ఓటమిని ఖాయమైనట్లే అనే సంకేతాలు ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నాయి. గత నెల 7వ తేదీన చంద్రబాబు దిల్లీ పర్యటనతో వైసీపీలో ప్రకంపనలకు దారి తీసింది. హుటాహుటిన వైఎస్ జగన్ దిల్లీలో వాలారు. అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. మరి తాడేపల్లి వ్యూహాలు ఎక్కడ బెడిసి కొట్టాయో ఏమో కానీ బీజేపీ మాత్రం బాబుతో జత కట్టాలనే నిశ్చయానికి వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో కచ్చితంగా జగన్ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందట. కమలనాథులకు అందిన సర్వే రిపోర్టులు ఏపీలో వైసీపీ కుప్పకూలుతుందని స్పష్టం చేశాయట. ఇక వైసీపీతో అంటకాగడం ఏ మాత్రం మంచిది కాదని అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు జగన్ ను దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో జత కట్టడం దీర్ఘకాలిక వ్యూహాలకు సైతం మేలు చేస్తుందని వారు విశ్వసిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి ఏపీలో పొత్తు వికసించాలని తీర్మానం చేశారు. అయితే సీట్లు విషయంలో కాస్త గట్టిగా పట్టుబట్టాలని భావిస్తున్నారు. వాస్తవిక పరిస్థితులు, బీజేపీకి ప్రస్తుత బలం కూటమికి మేలు చేసే విధంగా సీట్లను సర్దుబాటు చేసుకోవడం వంటి అంశాలపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఏదేమైనా ఏపీలో 2014 నాటి ఎన్నికల కాంబినేషన్ రిపీట్ కాబోతోందనేది సుస్పష్టం.

]]>
https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%a4-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8/feed/ 0 1910
మంత్రి వర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్ రఫ్! – Gummanuru Jayaram dropped from the Council of Ministers https://janagalam.com/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/ https://janagalam.com/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/#respond Tue, 05 Mar 2024 16:25:57 +0000 https://janagalam.com/?p=1903

అమరావతి: గుమ్మనూరు జయరాంను వైసీపీ మంత్రి మండలి నుంచి తప్పించారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ చర్యలు చేపట్టింది. తక్షణమే మంత్రి పదవి నుంచి గుమ్మనూరు జయరాం ను తప్పించాలన్న ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ ఆమోదించారు.  ఈ మేరకు ప్రభుత్వం గెజెట్ ను విడుదల చేసింది.

]]>
https://janagalam.com/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%97%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/feed/ 0 1903
బీసీలు అంటే భరోసా, బాధ్యత, భవిష్యత్తు : నారా లోకేష్ – TDP, Janasena Bc Declaration https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4/ https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4/#respond Tue, 05 Mar 2024 15:06:26 +0000 https://janagalam.com/?p=1900

మంగళగిరి: జయహో బీసీ బహిరంగసభలో ప్రసంగించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీసీ కులాలకు సరికొత్త నిర్వచనం చెప్పారు. బలహీన వర్గాలంటే భరోసా, బాధ్యత, భవిష్యత్తు అన్నారు. బీసీ కులాలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు, దాష్టీకాలను లోకేష్ ప్రసంగంలో ప్రస్తావించారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపు అన్న లోకేష్ కనీసం బలహీన వర్గాల నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని విమర్శించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి కలిగిన పార్టీ తెలుగుదేశం అన్న లోకేష్… ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీ నాయకత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. బీసీ సాధికారతకు కమిటీలు ఏర్పాటు చేశామన్న ఆయన… బీసీల్లో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతి, అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలను తద్వారా సాధించిన ఫలితాలను వివరించారు. మంగళగిరిలో ఓటమి పాలైనా ఇక్కడే ఉన్నానని… ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టానని లోకేష్ చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నిలబెట్టుకోలేదని అన్నారు.

]]>
https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4/feed/ 0 1900
బీసీల పొట్టకొట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్: జనసేన అధినేత https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af/ https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af/#respond Tue, 05 Mar 2024 14:54:18 +0000 https://janagalam.com/?p=1897

మంగళగిరి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో బీసీలు పూర్తిగా అణచివేయబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్న ఆయన బీసీ కులాల ఐక్యతకు పిలుపు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీల పొట్టకొట్టారని విమర్శించారు. ఇసుక రీచ్లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టిన తీరును ఎండగట్టారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని బీసీలకు ఏటా రూ. 15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి జగన్ మోసగించారని అన్నారు. వివిధ బీసీ కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై వచ్చే రోజుల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ లోని అంశాలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను ఉద్ఘాటించారు. బీసీ కులాలు యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలన్నదే జనసేన ఉద్దేశమని ఆ దిశగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని చెప్పారు. బీసీ కులాల రాజకీయ చైతన్యానికి, రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను పవన్ ఈ వేదికపై స్మరించుకున్నారు.

]]>
https://janagalam.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af/feed/ 0 1897
టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్ | Tdp – JanaSena Bc Declaration https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b0/ https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b0/#respond Tue, 05 Mar 2024 14:43:26 +0000 https://janagalam.com/?p=1894

మంగళగిరి: పది అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేశాయి. మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీల రక్షణకు, అభ్యున్నతికి వచ్చే ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ లోని అంశాలు…

  1. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ – పింఛన్ నెలకు రూ. 4 వేలకు పెంపు
  2. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం
  3. సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు
  4. సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు, సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
  5. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం, అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్
  6. కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం – జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు
  7. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపు – స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు – రూ. 5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు
  8. బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరణ, చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరణ – పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు
  9. చట్టబద్ధంగా కుల గణన, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేత
  10. విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ – గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ – షరతులు లేకుండా విదేశీ విద్య అమలు – పీజీ విద్యార్థుల ఫీజీరీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ – స్డడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభం
]]>
https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b0/feed/ 0 1894
జనసేన అధినేతపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు https://janagalam.com/%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%98%e0%b0%be%e0%b0%9f/ https://janagalam.com/%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%98%e0%b0%be%e0%b0%9f/#respond Sat, 24 Feb 2024 10:26:57 +0000 https://janagalam.com/?p=1881

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యఖ్యలు చేశారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల వ్యాఖ్యానించారు. అత్యంత దయణీయ స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారన్న సజ్జల… టీడీపీ, జనసేన పార్టీలవి దింపుడు కళ్లెం ఆశలంటూ విమర్శించారు. పవన్ ను అభిమానించే వారు పునరాలోచన చేసుకోవాలన్నారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి మిగిలిన స్థానాలకు సైతం చంద్రబాబు అభ్యర్థులను పంపిస్తారంటూ విమర్శలు చేశారు.

]]>
https://janagalam.com/%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%b2-%e0%b0%98%e0%b0%be%e0%b0%9f/feed/ 0 1881
ఫస్ట్ లిస్ట్ లో 14 మంది మహిళలకు చోటు https://janagalam.com/%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-14-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3/ https://janagalam.com/%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-14-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3/#respond Sat, 24 Feb 2024 10:12:34 +0000 https://janagalam.com/?p=1878

తెలుగుదేశం – జనసేన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న ఉమ్మడి అభ్యర్థుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మొత్తం 99 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ఖరారు చేశారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి నెల్లిమర్ల నియోజకవర్గానికి లోకం మాధవి పేరు ఖరారు కాగా, మిగిలిన 13 మంది టీడీపీ అభ్యర్థులుగా ఉన్నారు.

తొలిజాబితాలో చోటు దక్కించుకున్న 14మంది మహిళా అభ్యర్థుల వివరాలు.

  1. పెనుకొండ- సవిత
  2. రాప్తాడు- పరిటాల సునీత
  3. సింగనమల(ఎస్సీ)- బండారు శ్రావణి
  4. పాణ్యం- గౌరు చరితారెడ్డి
  5. ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
  6. కడప- మాధవిరెడ్డి
  7. సూళ్లూరుపేట(ఎస్సీ)- విజయశ్రీ
  8. నందిగామ(ఎస్సీ)- తంగిరాల సౌమ్య
  9. తుని- యనమల దివ్య
  10. పాయకరావుపేట(ఎస్సీ)- వంగలపూడి అనిత
  11. సాలూరు(ఎస్సీ)- గుమ్మడి సంధ్యారాణి
  12. విజయనగరం- అదితి గజపతిరాజు
  13. అరకు- జగదీశ్వరీ
  14. నెల్లిమర్ల- లోకం మాధవి(జనసేన)
]]>
https://janagalam.com/%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-14-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3/feed/ 0 1878
టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af/ https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af/#respond Sat, 24 Feb 2024 07:59:27 +0000 https://janagalam.com/?p=1871

తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల ప్రకటన చేశాయి. తొలి విడతలో భాగంగా జనసేన పార్టీ 5గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీలో నిలిచే 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. జనసేన పార్టీ మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ స్పష్టత ఇచ్చారు. తమ కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే అందుకు అనుగుణంగా సీట్లు సర్దుబాటు చేసుకునే విషయంపైనా అవగాహన వచ్చినట్లు పవన్ తెలిపారు.

జనసేన తరపున పవన్ కల్యాణ్ ప్రకటించిన 5గురు అభ్యర్థులు వీళ్లే:

  1. తెనాలి  – నాదెండ్ల మనోహర్
  2. నెల్లిమర్ల – లోకం మాధవి
  3. రాజానగరం- బత్తుల బాలకృష్ణ
  4. కాకినాడ రూరల్ – పంతం నానాజీ
  5. అనకాపల్లి – కొణతల రామకృష్ణ

టీడీపీ 94 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

  1. ఇచ్చాపురం-బెందాలం అశోక్
  2. టెక్కలి-అచ్చెన్నాయుడు
  3. ఆముదాలవలస – కూన రవికుమార్
  4. రాజాం- కోండ్రు మురళి
  5. కురుపాం – టి.జగదీశ్వరి
  6. పార్వతీపురం- విజయ్ బోనెలచంద్ర
  7. సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
  8. బొబ్బిలి- బేబి నయన
  9. గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్
  10. విజయనగరం- అథితి గజపతిరాజు
  11. విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ
  12. విశాఖ వెస్ట్ –గణబాబు
  13. అరకు- దొన్నుదొర
  14. పాయకరావుపేట – వంగలపూడి అనిత
  15. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
  16. తుని- యనమల దివ్య
  17. పెద్దాపురం- చినరాజప్ప
  18. అనపర్తి- నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
  19. ముమ్మడివరం- దాట్ల సుబ్బరాజు
  20. గన్నవరం(ఎస్సీ)- మహాసేన రాజేశ్
  21. కొత్తపేట- బండారు సత్యానందరావు
  22. మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు
  23. రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు
  24. జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
  25. ఆచంట- పితాని సత్యనారాయణ
  26. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
  27. ఉండి- మంతెన రామరాజు
  28. తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ
  29. ఏలూరు- బడేటి రాధాకృష్ణ
  30. చింతలపూడి(ఎస్సీ)- సొంగా రోహన్
  31. తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్
  32. నూజివీడు- కొలుసు పార్థసారథి
  33. గన్నవరం- యార్లగడ్డ వెంకట్రావు
  34. గుడివాడ- వెనిగండ్ల రాము
  35. పెడన- కాగిత కృష్ణప్రసాద్
  36. మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
  37. పామర్రు- వర్ల కుమార్ రాజా
  38. విజయవాడ సెంట్రల్- బోండా ఉమ
  39. విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు
  40. నందిగామ- తంగిరాల సౌమ్య
  41. జగ్గయ్యపేట- శ్రీరామ్ తాతయ్య
  42. తాడికొండ- తెనాలి శ్రావణ్ కుమార్
  43. మంగళగిరి- నారా లోకేశ్
  44. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
  45. వేమూరు- నక్కా ఆనంద్ బాబు
  46. రేపల్లె-అనగాని సత్యప్రసాద్
  47. బాపట్ల- నరేంద్ర వర్మ
  48. ప్రత్తిపాడు- బూర్ల రామాంజనేయులు
  49. చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
  50. సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ
  51. వినుకొండ- జీవీ ఆంజనేయులు
  52. మాచర్ల- జూలకంటి బ్రహ్మానందరెడ్డి
  53. యర్రగొండపాలెం- గూడూరి ఎరిక్షన్ బాబు
  54. పర్చూరు- ఏలూరు సాంబశివరావు
  55. అద్దంకి-గొట్టిపాటి రవి
  56. సంతనూతలపాడు- బీఎన్ విజయ్ కుమార్
  57. ఒంగోలు- దామచర్ల జనార్థన్
  58. కొండేపి- డోలబాల వీరాంజనేయస్వామి
  59. కనిగిరి- ఉగ్ర నరసింహారెడ్డి
  60. కావలి- కావ్య కృష్ణారెడ్డి
  61. నెల్లూరు సిటీ- పి.నారాయణ
  62. నెల్లూరు రూరల్ –కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి
  63. గూడూరు- పాశం సునీల్
  64. సూళ్లూరుపేట –నెలవెల విజయశ్రీ
  65. ఉదయగిరి- కాకర్ల సురేష్
  66. కడప- మాదవిరెడ్డి
  67. రాయచోటి- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
  68. పులివెందుల- బీటెక్ రవి
  69. మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
  70. ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
  71. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  72. కర్నూలు- టీజీ భరత్
  73. పాణ్యం- గౌరు చరితారెడ్డి
  74. నంద్యాల- ఎన్ఎమ్‌డీ ఫరూక్
  75. బనగానపల్లి – బీసీ జనార్థన్ రెడ్డి
  76. డోన్- కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
  77. పత్తికొండ- కేఈ శ్యామ్ బాబు
  78. కోడుమూరు- బొగ్గుల దస్తగిరి
  79. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
  80. ఉరకొండ- పయ్యావుల కేశవ్
  81. తాడిపత్రి –జేసీ అస్మిత్ రెడ్డి
  82. సింగనమల- బండారు శ్రావణి
  83. కల్యాణదుర్గం- అమిలినేని సురేంద్రబాబు
  84. రాప్తాడు- పరిటాల సునీత
  85. మడకశిర- ఎమ్ఈ సునీల్ కుమార్
  86. హిందూపురం – నందమూరి బాలకృష్ణ
  87. పెనుకొండ- సవితా
  88. తంబాళపల్లి- జయచంద్రారెడ్డి
  89. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
  90. నగరి- గాలి బానుప్రకాశ్ రెడ్డి
  91. జీడీ నెల్లూరు- వీఎమ్ థామస్
  92. చిత్తూరు- గురజాల జగన్మోహన్
  93. పలమనేరు- అమర్నాథ్ రెడ్డి
  94. కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

]]>
https://janagalam.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af/feed/ 0 1871
అమరావతిలో ఆర్తనాదం – విశాఖలో విధ్వంసం https://janagalam.com/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be/ https://janagalam.com/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be/#respond Wed, 21 Feb 2024 06:23:04 +0000 https://janagalam.com/?p=1868

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి సీట్లను గెలుచుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడిచిన 5ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి చేసిందేంటి? అమరావతిపై విషం కక్కారు… విశాఖపై కపట ప్రేమ చూపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చి… మూడు ముక్కలాటతో సంవత్సరాల సమయం కాలయాపన చేసిన ముఖ్యమంత్రిగా జగన్ అప్రతిష్ట పాలయ్యారు. విశాఖలో సీఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి, అటవీశాఖ పరిధిలో ఉన్న రుషికొండను ఛిద్రం చేసి వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి కోర్టు తీర్పులు అడ్డు రాలేదు. కానీ, విశాఖ నగరాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా పరిపుష్టం చేయడానికి మాత్రం జగన్ కు అడుగడుగునా కోర్టు వంకలు దొరికాయి. సిద్ధం అంటూ యుద్ధం చేస్తాం అంటున్న జగన్ ఓ వైపు సంసిద్ధం అంటూ ప్రతిపక్ష టీడీపీ – జనసేన పార్టీలు మరోవైపు ఎన్నికల పోరుకు తలపడుతున్నాయి… మరి ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉండాలి అనే అంశంపై ‘జనగళం’ అనిల్ కేతా విశ్లేషణ.

]]>
https://janagalam.com/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be/feed/ 0 1868
సీఎం జగన్‍కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ https://janagalam.com/1862-2/ https://janagalam.com/1862-2/#respond Sun, 18 Feb 2024 15:11:54 +0000 https://janagalam.com/?p=1862
  • అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు నేను సిద్దం
  • బూటకపు ప్రసంగాలు కాదు…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా?
  • ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం? చర్చకు వచ్చే దమ్ముందా జగన్?
  • 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్
  • వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు
  • ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడు…మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు
  • రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ది కాదు…ఏ ఊరుకెళ్లినా నీ 5 ఏళ్ల పాలనా విధ్వంసం కనిపిస్తోంది

సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కౌంటర్

  •  అమరావతి:- రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ….అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గుతేల్చేందుకు తాను సిద్ధం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? ఏ అంశం మీదైనా..ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్దమే అని చంద్రబాబు అన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధాం..చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ సవాల్ చేశారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ కానుందని అన్నారు. ఓటమిపై జగన్ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్తా పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్….పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ది కాదు…ఏ ఊరుకెళ్లినా జగన్ 5 ఏళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని సభలు పెడుతూ జగన్ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండి పడ్డారు.

ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడతపెట్టాడని…మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి…సామాజిక ద్రోహం చేసిన జగన్..సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదని అన్నారు. జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందని అన్నారు.

• రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్.టి.సి, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్టేషన్ తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు.
• వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం అని అన్నారు. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారని అన్నారు. ఎస్.సి., ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్ పై పేదలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
• తెలుగుదేశం పేరు, నా పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 11 డిఎస్సీలతో ఇచ్చిన 1.50 లక్షల టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు గుర్తుకు వస్తాయి అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళల కోసం 22 పథకాలు తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు.
• జగన్ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా గుర్తొస్తాయన్నారు. జగన్ పేరు చెపితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తొస్తాయని దుయ్యబట్టారు.
• మ్యానిఫెస్టోలో మద్య నిషేధం అని చెప్పి…తరువాత దాన్ని మద్య నియంత్రణ అని మార్చి..రూ.1.50లక్షల కోట్ల మద్యం అమ్మిన జగన్ విశ్వసనీయత గురించి చెపితే జనం నమ్మాలా అని ప్రశ్నిచారు. 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు అని జగన్ చెపుతున్న మాటలు పూర్తిగా బూకటం అని….ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాధుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపడం నిజం అని అన్నారు. నిన్నటి వరకు పరదాల్లో తిరిగిన జగన్….9 సార్లు కరెంట్ చార్జీలు పెంచిన జగన్….పేదల గురించి ఎన్నికల సమయంలో మాయ మాటలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు.
• రైతు భరోసాలో జగన్ ఇచ్చింది రూ.37వేలు మాత్రమే. రైతు రుణమాఫీ ద్వారా ఒకే సారి మేం రూ.50 వేలు ఇచ్చింది వాస్తవం కాదా…ఎన్నికల సమయంతో మిగిలిన మొత్తం అందకుండా నాడు జగన్ కుట్రలు చేసింది నిజం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి, రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదని అన్నారు.
• విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అనేక అడ్డంకులు సవాళ్ళు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళితే…. జగన్ తన విధ్వంస పాలనతో విభజన కంటే ఎక్కువ నష్టం చేశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో 14 శాతం ఉండే వృద్ధిరేటు…ఈ ప్రభుత్వం వచ్చాక 10.93 శాతానికి పడిపోయిందని, వైసీపీ ప్రభుత్వ హయంలో వృద్ధి రేటు 4.06 శాతం తగ్గింది, టాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయానికి గండి పడిందన్నారు. విభజన జరిగినప్పుడు మనకంటే తెలంగాణ 35 శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే…2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించామని వివరించారు. ఇప్పుడు జగన్ నిర్వాకం వల్ల ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44 శాతం తక్కువగా ఉందని, అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు అన్నారు.
• రాష్ట్రంలో అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం తప్ప జగన్ సాధించింది శూన్యం అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకే కేసులతో వేధిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై తాజాగా కేసు పెట్టడాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండిచారు. జగన్ కేసులు పెట్టినా….దాడులు చేసినా ప్రశ్నించే గళాలను అణిచివేయలేడని…ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని….తమ జీవితాలు నాశనం చేసిన ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి జనంతో కసితో ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

]]>
https://janagalam.com/1862-2/feed/ 0 1862