రామచిలుక పక్షి జాతులలో ఎంతో సుందరమైనది. చాలామంది బాగా ఇష్టపడే చిలుక ఇదే అనడంలో సందేహమే లేదు. పచ్చని వర్ణంతో ఎంతో ఆహ్లాదాన్ని పంచే రామచిలుక సాధారణంగా కాస్త అలికిడి అయనా వెంటనే తుర్రుమని జారుకుని ఎగిరి పోతుంది. కానీ, ఈ పంచదార చిలుక స్నేహం చేస్తే మాత్రం మనల్ని చాలా ఎక్కువగా నమ్ముతుందండీ. ఇందుకు… మన విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఓ ఆసక్తికర ఉదాహరణ ఉంది మరి. ఇక్కడి సెక్యురిటీ సిబ్బందితో కొద్ది కాలంగా ఓ రామచిలుక స్నేహం చేస్తోంది. దానికి వారు ముద్దుగా రాముడు అని పేరు పెట్టుకున్నారు. పిలిస్తే పలికే చిలుక ఇది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సమయాల్లో వారి దగ్గరకు వస్తుంది. వారు పెట్టింది తిని కాసేపు కంటి భాషతో వారిని పలుకరించి నింగికి ఎగిరి విహారాల్లో తేలిపోతుంది. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వారికి ఈ అందాల చిలుక ఎదురుపడితే మరి ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంటారు.
To Watch Video Click Here: (12) వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ కు స్పెషల్ గెస్ట్ ఈ ‘రామచిలుక’ | టైమ్ కి వస్తుంది పలుకరించి వెళ్తుంది | జనగళం – YouTube