అమరావతిలో ఆర్తనాదం – విశాఖలో విధ్వంసం
ఏపీ ప్రజలు ఆలోచించాలి... ఏం జరిగింది... ఏం జరుగుతోంది... దేనికి సిద్ధం కావాలి అని!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి సీట్లను గెలుచుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడిచిన 5ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి చేసిందేంటి? అమరావతిపై విషం కక్కారు… విశాఖపై కపట ప్రేమ చూపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చి… మూడు ముక్కలాటతో సంవత్సరాల సమయం కాలయాపన చేసిన ముఖ్యమంత్రిగా జగన్ అప్రతిష్ట పాలయ్యారు. విశాఖలో సీఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి, అటవీశాఖ పరిధిలో ఉన్న రుషికొండను ఛిద్రం చేసి వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి కోర్టు తీర్పులు అడ్డు రాలేదు. కానీ, విశాఖ నగరాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా పరిపుష్టం చేయడానికి మాత్రం జగన్ కు అడుగడుగునా కోర్టు వంకలు దొరికాయి. సిద్ధం అంటూ యుద్ధం చేస్తాం అంటున్న జగన్ ఓ వైపు సంసిద్ధం అంటూ ప్రతిపక్ష టీడీపీ – జనసేన పార్టీలు మరోవైపు ఎన్నికల పోరుకు తలపడుతున్నాయి… మరి ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉండాలి అనే అంశంపై ‘జనగళం’ అనిల్ కేతా విశ్లేషణ.