టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపాటు
-
- పౌర హక్కులను హరించి నీతి సూత్రాలు వల్లిస్తారా?
- హైకోర్టు ఆదేశాల మేరకే రఘురామకు మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు
- నివేదికను బోర్డు నేరుగా న్యాయస్థానానికే అందచేసింది
- ఇందులో ప్రభుత్వ ప్రమేయం, జోక్యం ఎక్కడుంది?
- బెయిల్ రాలేదనే.. బాబు స్క్రిప్టు ప్రకారం కొట్టినట్టు తప్పుడు ఆరోపణలు
- ఆయన ఓపక్క మీసం మెలేస్తూ మరోపక్క అరికాళ్లపై నడుస్తున్నారు
- రాజద్రోహం అనే కేసు ఉందా? అని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం
- ఆయన హయాంలో కేసీఆర్ సహా ఎంతోమందిపై కేసులు బనాయించారు
సాక్షి, అమరావతి: అరాచక, ఆటవిక పాలన సాగించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలోనే పౌర హక్కులకు భంగం కలిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నాడు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని కొడితే పంచాయతీ చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎర్ర చందనం దుంగల కేసు గురించి ఆలోచిస్తే చంద్రబాబు బండారం బట్టబయలవుతుందన్నారు.