సినిమా

అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’,  ఫస్ట్ లుక్ రిలీజ్

కామెడీ ట్రాక్ లో సందడి చేయనున్న అల్లరి నరేష్

అల్లరి ఈజ్ బ్యాక్. కొద్ది కాలంగా సీరియస్ సబ్జెక్ట్ లను సెలక్ట్ చేసుకుంటూ విభిన్న సినిమాలు చేసిన అల్లరి నరేష్ తిరిగి కామెడీ ట్రాక్ కి వచ్చేశారు. 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపిన అల్లరి నరేష్ నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను నిర్మాతలు విడుదల చేశారు. అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ కెరియర్లో ఎపిక్ హిట్ గా నిలిచిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’,  ఆ పేరుని తమ చిత్రానికి టైటిల్ గా పెట్టుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

అల్లరి నరేష్ పాత్ర పేరు గణ, అతని పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. టైటిల్‌ను రివిల్ చేస్తూ “ఆ ఒక్కటీ అడక్కు…” అని వారికి సమాధానమిస్తాడు. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్తాడు, అయితే సినిమా తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. టైటిల్ లాగే, గ్లింప్స్ హిలేరియస్ గా నవ్వులు పూయించింది.

ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె. కె. మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రాన్ని మార్చి 22, 2024న విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరుల

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button