హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా-ఓషియానియా అంతర్జాతీయ టెన్నిస్ పోటీలకు తెలుగమ్మాయి కిలారు రాజా సర్వజ్ఞ ఎంపికైంది. వచ్చేనెల 14 నుంచి 19 వరకు కజకిస్థాన్‌లోని నూర్ సుల్తాన్‌లో జరగనున్న ఈ పోటీల్లో సర్వజ్ఞ భారత్ తరఫున బాలికల అండర్-14 విభాగంలో బరిలోకి దిగనుంది. సర్వజ్ఞతో పాటు బాలికల విభాగంలో షాలిని, సమీక్ష, రియా, బాలుర కేటగిరిలో రితిన్ ప్రణవ్, క్రిష్ త్యాగి, మనాస్ దామ్నే, సాజిద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.