News AnalysisUncategorized

ఇంత నీచులేంట్రా బాబూ | Ys Jagan Blue Media Degrading Propaganda on SriCharani Success

Anil Ketha Exposes YSRCP's False Propaganda on Ap Government Importance to Cricketer Sreecharani

ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన క్రీడాకారుల చుట్టూ నీచమైన రాజకీయం చేసే సంస్కృతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. తెలుగు బిడ్డ శ్రీచరణి అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తుంటే… వైసీపీ బ్లూ మీడియా మాత్రం ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వం శ్రీచరణిని విస్మరించిందని, అవమానించిందని సాక్షి మీడియా ప్రసారం చేసింది. ఇవాళ ఏపీకి వచ్చిన శ్రీచరణికి ఏసీఏ ప్రతినిధులు, మహిళా మంత్రులు అద్భుత స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబు, లోకేష్ శ్రీచరణితో పాటు మిథాలీ రాజ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ విషయాలు మాత్రం సాక్షికి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీచరణి ఏపీలో అడుగుపెట్టక ముందే ఆమెకు ఏపీ ప్రభుత్వం ఎలా గౌరవించగలదు అనే విషయం జగన్ మీడియాకే తెలియాలి. ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా… మహరాష్ట్ర నుంచి స్మృతి మందన, జెమీలియా, రాధా యాదవ్ జట్టులో ఉన్నారు… ఆ ముగ్గురికీ మహరాష్ట్ర సీఎం ఇవాళే సన్మానం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంతో సొంత రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణిని సైతం రాజకీయానికి వాడుకునేందుకు దిగజారుడుతనం ఒక్క వైసీపీకి మాత్రమే సాధ్యమైంది. జగన్ బ్లూ మీడియా దుష్ప్రచారంపై ‘జనగళం’ అనిల్ కేతా విశ్లేషణ చూడండి.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button