ప్రపంచం అంతటా ఓ వైపు కొవిడ్ కేసులు అంచనాలను తలకిందులు చేస్తూ పెరుగుతున్నాయి. భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశాలు ఇవాళ మహమ్మారి ప్రభావంతో వణికి పోతున్నాయి. మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానాలు తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం అందరి చూపునూ ఆ దేశంవైపు తిప్పుకుంది. ఆ దేశంలో ఇక మాస్కు లేకుండా స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. బహిరంగ ప్రదేశాల్లో ఇక మాస్కు ధరించడం ఎంత మాత్రం తప్పని సరి కాదు. అక్కడి ప్రభుత్వ అధికారికంగా మాస్కు ధరించాల్సిన అవసరం ఇక లేదని వెల్లడించింది. ఇందుకు కారణం అక్కడి ప్రభుత్వ ముందుచూపు. కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టాలంటే కచ్చితంగా వ్యాక్సినేషన్ విస్తృతంగా చేయాలన్న ఆలోచన. అందుకు అనుగుణంగా దూరదృష్టితో చేపట్టిన చర్యల ఫలితంగా ఆ దేశంలో 50% జనాభా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక అక్కడ కొవిడ్ వ్యాప్తి చెందేందుకు వీలు లేకుండా హెర్డ్ ఇమ్యునిటీ కలిగిన దేశంగా ఇజ్రాయెల్ మారింది. మాస్కును ప్రతి ఒక్కరూ ధరించడం తప్పనిసరి అంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను గత ఆదివారం రద్దు చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం కొవిడ్ ను ధీటుగా ఎదుర్కొన్న దేశంగా అందరి మన్ననలు అందుకుంటోంది.
Related Articles
ఈరోజు ప్రెస్ ఆహ్వానం
September 24, 2024