ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొగిలయ్యను ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. నిరుపేద కళాకారుడిగా 12 మొట్ల కిన్నెరపై తనదైన పాటలతో ప్రజలను అలరిస్తుంటాడు మొగిలయ్య. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్ పాడారు. మొగిలయ్య ప్రతిభకు మెచ్చి పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన వ్యక్తి మొగులయ్య. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగులయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. మొగిలయ్యకు పద్మశ్రీ రావడం పట్ల జానపద కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొగిలయ్యతోపాటు కళారంగంలో తెలంగాణ నుంచి మరో ఇద్దరు రామచంద్రయ్య, పద్మాజారెడ్డి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవిస్తుంది. ఇప్పటి వరకు 68 సార్లు కేంద్రం పద్మపురస్కారాలను ప్రదానం చేసింది.
Related Articles
ఈరోజు ప్రెస్ ఆహ్వానం
September 24, 2024