టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కొవిడ్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టు చేయించుకోగా ఫలితం పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇంటి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి సూచించారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూ కొవిడ్ సోకింది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.