మహిళా క్రికెటర్ తల్లి చికిత్సకు సాయం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి తల్లి కరోనా చికిత్స కోసం రూ.6.77 లక్షల సహాయం అందించాడు. కోహ్లీ పెద్ద మనసును స్రవంతి మాత్రమే కాకుండా.. నెటిజన్లందరూ ప్రశంసిస్తున్నారు. టీమిండియా మాజీ మహిళా క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం స్రవంతి రూ.16 లక్షలు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఆమె తల్లి కోలుకోలేదు. దీంతో సహాయం కోసం ఆమె బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సహాయం కోరింది.
విషయం తెలుసుకున్న బీసీసీఐ మాజీ సౌత్‌జోన్ కన్వీనర్ విద్యా యాదవ్.. స్రవంతి పరిస్థితిని వివరిస్తూ ఓ ట్వీట్ చేసి దానికి విరాట్ కోహ్లీకి ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన కోహ్లీ తన వంతుగా రూ.6.77 లక్షల సహాయం అందించాడు. `గొప్ప క్రికెటర్ నుంచి గొప్ప ఔదార్యం. కోహ్లీ నుంచి వెంటనే వచ్చిన స్పందన అద్భుతంగా అనిపించింది. విషయాన్ని కోహ్లీ వరకు తీసుకెళ్లిన టీమిండియా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌కు కూడా ధన్యవాదాల`ని విద్య ట్వీట్ చేశారు.