ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుఫొటోలు
చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి
హిందూపురం నియోజకవర్గంలో 'నిజం గెలవాలి' కార్యక్రమం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 8వ వార్డుకు చెందిన అంజనప్ప కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన అంజనప్ప కుటుంబ సభ్యులను ఓదార్చి రూ. 3 లక్షలు చెక్కును అందించారు. సింగనమల గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్ దంపతులు తమ బిడ్డకు నామకరణం చేయమని భువనేశ్వరిని కోరారు. ఆ చిన్నారికి కుశల్ కృష్ణ అని నామకరణం చేసిన భువనేశ్వరి అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు.