జగన్ కు సినిమా పిచ్చి పట్టింది – Nara Lokesh Shankharavam Speech in Parvathipuram
గంజాయి మొక్కగా ఎలా మారావు విడదల రజని
పార్వతీపురం శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చెత్త ప్రభుత్వ వైఫల్యాలతో కలుషిత నీరు తాగి గుంటూరులో ఇద్దరు చనిపోయారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్న దున్నపోతు ప్రభుత్వానికి సమీక్ష చేసే తీరిక లేదంటూ మండిపడ్డారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనికి లోకేష్ ఘాటు ప్రశ్నలు సంధించారు. టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు నాటిన తులసి మొక్క అన్న రజని ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ” జగన్ రెడ్డికి సినిమా పిచ్చి ఎక్కువైంది. వ్యూహం, యాత్ర అంటూ సొంత పార్టీ కార్యకర్తలకు ఫ్రీగా టిక్కెట్లు పంచిపెడుతున్నారు. అయినా ఆ సినిమాలు చూసే వారు లేకుండా పోయారు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. వైకాపా పనైపోయింది, ఇక అంతిమయాత్రే” అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.