ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
జనసేన అధినేతపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ- జనసేన అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ స్పందన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యఖ్యలు చేశారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల వ్యాఖ్యానించారు. అత్యంత దయణీయ స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారన్న సజ్జల… టీడీపీ, జనసేన పార్టీలవి దింపుడు కళ్లెం ఆశలంటూ విమర్శించారు. పవన్ ను అభిమానించే వారు పునరాలోచన చేసుకోవాలన్నారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి మిగిలిన స్థానాలకు సైతం చంద్రబాబు అభ్యర్థులను పంపిస్తారంటూ విమర్శలు చేశారు.