
మహిళా క్రికెట్ జట్టు సభ్యుల కాంట్రాక్టు వివరాలు వెల్లడించిన బీసీసీఐ
హర్మన్ ప్రీత్ కౌర్, స్మ్రితి మందన, పూనమ్ యాదవ్ కు ఏ-గ్రేడ్ లో చోటు
భారత క్రికెట్ మహిళా జట్టు సభ్యుల కాంట్రాక్టు వివరాలను బీసీసీఐ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2021 వరకు కాంట్రాక్టు వర్తించనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మొత్తం 19మంది సభ్యులకు ఇందులో చోటు దక్కింది. వీరిలో ముగ్గురు మహిళా క్రికెటర్లకు ఏ- గ్రేడ్ లో చోటు కల్పించగా మరో 10 మందికి బి- గ్రేడ్ లో అవకాశం కల్పించారు. మిగిలిన వారు సి- గ్రేడ్ లో ఉన్నారు. ఏ- గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు రూ. 50 లక్షలు, బి- గ్రేడ్ లో ఉన్న వారికి రూ. 30 లక్షలు, సి- గ్రేడ్ లో ఎంపికైన ఆటగాళ్లకు రూ. 10 లక్షలు చెల్లించనున్నారు.