ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్ | Tdp – JanaSena Bc Declaration
పది అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రవేశ పెట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

మంగళగిరి: పది అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ను తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేశాయి. మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీల రక్షణకు, అభ్యున్నతికి వచ్చే ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ లోని అంశాలు…
- బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ – పింఛన్ నెలకు రూ. 4 వేలకు పెంపు
- బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం
- సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు
- సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు, సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
- స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం, అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్
- కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం – జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు
- జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపు – స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు – రూ. 5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు
- బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరణ, చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరణ – పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు
- చట్టబద్ధంగా కుల గణన, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేత
- విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ – గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ – షరతులు లేకుండా విదేశీ విద్య అమలు – పీజీ విద్యార్థుల ఫీజీరీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ – స్డడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభం