పఠాన్ చెరువులో లాక్ డౌన్ అమలును పరిశీలించిన డీజీపీ
కొవిడ్ ఉద్ధృతిని నియంత్రించే దిశగా చేపట్టిన రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో డీజీపీ పర్యటించారు. పఠాన్ చెరువులో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను సమర్థంగా అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సిబ్బంది చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. ప్రజలు కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.