షీ ఈజ్ బ్లైండ్ బై బర్త్… బట్ విజనరీ బై యాక్ట్స్… అజ్ఞాన చీకట్లను తరిమేయడమే అసలైన జీవన మార్గం. జ్ఞాన జ్యోతిగా ప్రకాశించడమే సిసలైన జీవిత లక్ష్యం కావాలనే తలంపు ఆమెది. మనోనేత్రాలతో దైవాన్ని దర్శించి ఆరాధిస్తే… అచంచలమైన మనస్సు సిద్ధిస్తుందనేది ఆమె విశ్వాసం. జీవితం తేజోమయం కావాలన్నా… ఆ జీవితానికి ఒక అర్థం దొరకాలన్నా… నైతిక ధర్మమే సాధనంగా ముందుకు సాగాలనేది ఆమె గ్రహించిన జీవన పరమార్థం. అంధత్వాన్ని జయిస్తూ… విద్యా కుసుమాలను సమున్నతంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఉపాధ్యాయ వృత్తిలో ఆమె అనుసరిస్తున్న మార్గం ప్రశంసనీయం… భక్తి పారవశ్యంతో దైవనామస్మరణ చేయడమే కాకుండా… ఆధ్యాత్మిక సుగంధాలను ఎంతో మందికి పంచేందుకు భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి అనువదించిన శ్రీ లక్ష్మీ నారాయణమ్మ… ఇవాళ్టి మన జనగళం ‘ఇన్స్పైరింగ్ 30… కార్యక్రమం ప్రత్యేక అతిథి.