ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుముఖ్యాంశాలురాజకీయం
ఫస్ట్ లిస్ట్ లో 14 మంది మహిళలకు చోటు
జనసేన - టీడీపీ అభ్యర్థుల్లో మహిళలు వీరే...
తెలుగుదేశం – జనసేన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న ఉమ్మడి అభ్యర్థుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మొత్తం 99 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ఖరారు చేశారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి నెల్లిమర్ల నియోజకవర్గానికి లోకం మాధవి పేరు ఖరారు కాగా, మిగిలిన 13 మంది టీడీపీ అభ్యర్థులుగా ఉన్నారు.
తొలిజాబితాలో చోటు దక్కించుకున్న 14మంది మహిళా అభ్యర్థుల వివరాలు.
- పెనుకొండ- సవిత
- రాప్తాడు- పరిటాల సునీత
- సింగనమల(ఎస్సీ)- బండారు శ్రావణి
- పాణ్యం- గౌరు చరితారెడ్డి
- ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
- కడప- మాధవిరెడ్డి
- సూళ్లూరుపేట(ఎస్సీ)- విజయశ్రీ
- నందిగామ(ఎస్సీ)- తంగిరాల సౌమ్య
- తుని- యనమల దివ్య
- పాయకరావుపేట(ఎస్సీ)- వంగలపూడి అనిత
- సాలూరు(ఎస్సీ)- గుమ్మడి సంధ్యారాణి
- విజయనగరం- అదితి గజపతిరాజు
- అరకు- జగదీశ్వరీ
- నెల్లిమర్ల- లోకం మాధవి(జనసేన)