ముఖ్యాంశాలుసినిమా

బంగార్రాజు రివ్యూ

రేటింగ్ 3/5

నటీనటులు:అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజి, సంపత్
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
సంగీతం:అనూప్ రూబెన్స్
నిర్మాతలు:అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 2022 జనవరి 14
                                    రేటింగ్: 3/5
సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా విడుదలైన చిత్రం బంగార్రాజు. మనం తర్వాత నాగార్జున, నాగచైతన్య
కలిసి నటించడం, సొగ్గాడి కంటే మించిన సినిమా అని, పండుగ లాంటి సినిమా అని చెప్పడంతో అక్కినేని అభిమానుల్లో
అంచనాలు రెట్టింపు అయ్యాయి. పైగా కరోనా కేసుల ఉద్దృతి ఓవైపు, ఏపీలో థియేటర్లపై ఆంక్షల నడుమ ఎంతో సాహసం
చేసి బంగార్రాజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి బంగార్రాజు సొగ్గాడిని మరిపించాడా లేదో చదవండి
ఇదీ కథ:
సొగ్గాడే చిన్నినాయనా ఎక్కడ ముగుస్తుందో అక్కడ బంగార్రాజు కథ మొదలవుతుంది. శివపురంలో బంగార్రాజు కుటుంబానికి ఆ ఊరి శివాలయంతో తరతరాలుగా సంబంధం ఉంటుంది. 24 ఏళ్లకోసారి ఆ కుటుంబం శివుడికి మహాభిషేకం చేస్తారు. కానీ ఆ శివాలయం కింద ఎంతో విలువైన నిధులుంటాయి. ఆ నిధులు దక్కించుకోవడానికి బంగార్రాజు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో బంగార్రాజు(నాగార్జున) చనిపోయి స్వర్గానికి వెళ్తాడు. బంగార్రాజు-సత్యభామ(రమ్యకృష్ణ)ల కొడుకు రాము(నాగార్జున)కు బాబు పుడుతాడు. పురిట్లోనే రాము భార్య సీత చనిపోవడంతో సత్యనే ఆ పిల్లాడికి తాత పేరే పెట్టి చిన్న బంగార్రాజు(నాగచైతన్య)గా పెంచుతుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక రాము అమెరికా వెళ్లిపోతాడు. అచ్చం తాత చేసిన అల్లరే చిన్నబంగార్రాజు చేస్తుంటాడు. చిన్న వయస్సులోనే అమ్మాయిల రాసలీలను చూసి తట్టుకోలేని సత్యభామ గుండెపోటుతో చనిపోతుంది. స్వర్గంలో ఉన్న పెద్ద బంగార్రాజు దగ్గరికి వెళ్లిపోతుంది. తాత, నాన్నమ్మ చనిపోవడం, తండ్రి అమెరికాలోనే ఉండిపోవడంతో బంధువులు, కుటుంబసభ్యుల మధ్య చిన్నబంగార్రాజు ఆకతాయిగా జీవిస్తుంటాడు. మామ(రావు రమేష్) కూతురు నాగలక్ష్మి(కృతిశెట్టి)తో గిల్లిగజ్జాలు పెట్టుకుంటూ గడుపుతుంటాడు. పుట్టినప్పుడే బంగార్రాజు, నాగలక్ష్మిల పెళ్లి చేయాలని సత్య, రమేశ్ లు నిర్ణయిస్తారు. సత్య చనిపోవడంతో ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. స్వర్గానికి వెళ్లిన సత్య బంగార్రాజుకు ఈ విషయాన్ని చెప్పి
ఎలాగైనా భూమి మీదకు వెళ్లి చిన్నబంగ్రారాజు, నాగలక్ష్మిల పెళ్లి చేయాలని పట్టుపడుతుంది. ఈ క్రమంలో శివాలయం కింద ఉన్న వజ్రాల నిధిని దక్కించుకోవాలంటే చిన్న బంగార్రాజును మట్టుపెట్టాలని ప్రత్యర్థులు కుట్రపన్నుతారు. ఈ విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు(నాగబాబు) స్వర్గంలో ఉన్న బంగార్రాజును భూమిమీదకు పంపిస్తాడు. మనవడి పెళ్లి జరిపించడానికి వచ్చిన బంగార్రాజు మనవడి శరీరంలోకి వెళ్లి భూమి మీద మరోసారి ఎలాంటి సందడి చేశాడు? మనవడ్ని మట్టుపెట్టాలకున్న వ్యక్తులెవరో తెలుసుకున్నాడా లేదా? విదేశాలకు వెళ్లిన రాము తిరిగొచ్చాడా లేదా? చివరకు చిన్నబంగార్రాజు, నాగలక్ష్మిల పెళ్లి జరిగిందా లేదా అనేది తెరపై చూడాల్సిందే.
బలంః కథ, నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, పాటలు, క్లైమాక్స్
బలహీనతః అక్కడక్కడ సాగదీత
చివరగాః ఈ సంక్రాంతి బంగార్రాజుదే.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button