బీసీలు అంటే భరోసా, బాధ్యత, భవిష్యత్తు : నారా లోకేష్ – TDP, Janasena Bc Declaration
బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో నారా లోకేష్
మంగళగిరి: జయహో బీసీ బహిరంగసభలో ప్రసంగించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీసీ కులాలకు సరికొత్త నిర్వచనం చెప్పారు. బలహీన వర్గాలంటే భరోసా, బాధ్యత, భవిష్యత్తు అన్నారు. బీసీ కులాలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు, దాష్టీకాలను లోకేష్ ప్రసంగంలో ప్రస్తావించారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపు అన్న లోకేష్ కనీసం బలహీన వర్గాల నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని విమర్శించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి కలిగిన పార్టీ తెలుగుదేశం అన్న లోకేష్… ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీ నాయకత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. బీసీ సాధికారతకు కమిటీలు ఏర్పాటు చేశామన్న ఆయన… బీసీల్లో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతి, అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలను తద్వారా సాధించిన ఫలితాలను వివరించారు. మంగళగిరిలో ఓటమి పాలైనా ఇక్కడే ఉన్నానని… ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టానని లోకేష్ చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నిలబెట్టుకోలేదని అన్నారు.