రాజాంలో శంఖారావం సభకు అద్భుత స్పందన
చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని నారా లోకేష్ హెచ్చరిక
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో నారా లోకేష్ శంఖారావం సభ విజయవంతమైంది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కొండ్రు మురళి అధ్యక్షతన జరిగిన శంఖారావం బహిరంగ సభ లోకేష్ ప్రసంగంతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఉత్తరాంధ్ర ప్రజానీకం గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటితే పట్టభద్రులు అసలు ఓటర్లే కాదన్న సజ్జల వ్యాఖ్యలను ఉటంకించారు. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందన్నారు. సజ్జలకు మంగళగిరి సహా పొన్నూరులో ఓట్లు ఉన్నాయన్న లోకేష్ ముఖ్యమంత్రి సలహాదారుడే రెండు ఓట్లు వేసే పరిస్ధితి రాష్ట్రంలో ఉందన్నారు. అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారిని విడిచిపెట్టేది లేదంటూ తీవ్ర హెచ్చరిక చేశారు.