ఆంధ్రప్రదేశ్ముఖ్యాంశాలు

రాష్ట్రంలో 14 మెడికల్, 2 నర్సింగ్ కళాశాలల ఏర్పాటు: సీఎం జగన్

Story Highlights
  • మెడికల్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
  • వీటి నిర్మాణం కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
  • వైద్యారోగ్యంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా ఏపీ ఉండాలి: సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • ప్రభుత్వం ఏర్పాటై 2ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం: సీఎం
  • ప్రతి పార్లమెంట్ పరిధిలో నూతనంగా మెడికల్ కళాశాల వస్తుంది: జగన్

 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ రంగంలో 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి ఇవాళ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాలలు సహా రెండు నర్సింగ్ కళాశాలల్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రుల ద్వారా మంచి వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కళాశాలల నిర్మాణానికి రూ. 8వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button