సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రెజ్లర్ మర్డర్ కేసులో డబుల్ ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు కోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ కోసం అతడు చేసుకొన్న దరఖాస్తును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. మర్డర్ కేసులో అతడే ప్రధాన నిందితుడని, అతడిపై వచ్చిన ఆరోపణలు ఎంతో తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. ఈనెల 4న ఛత్రశాల స్టేడియంలో 23 ఏళ్ల సాగర్ రాణా అనే రెజ్లర్ హత్య కేసులో సుశీల్ ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఘటన తర్వాత అతడు పరారీలో ఉన్నాడు. దీంతో సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.