లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్… బట్ సమ పీపుల్స్ లైఫ్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. జీవితాన్ని మనం చూసే దృక్కోణం సరైన మార్గంలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. విశాఖకు చెందిన జయశ్రీ హటంగడి జీవితం ఇందుకు ఓ చక్కటి నిదర్శనం. ఆరుపదులు దాటిన వయస్సులోనూ ఆమె ఉత్సాహం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో హై వోల్టేజ్ ఎనర్జిటిక్ ‘హెరిటేజ్ నెరేటర్’ ఎవరు అంటే జయశ్రీ హటంగడి అనే చెప్పవచ్చు. అందుకే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ఎన్ఎస్జీ కమాండోస్ విశాఖకు వచ్చినప్పుడు… వారికి మన వారసత్వ విశిష్టతను వివరించే అవకాశం జయశ్రీకి లభించింది. దృఢమైన ఆత్మవిశ్వాసం, సడలని సంకల్పమే ఆభరణాలుగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శ్రీమతి జయశ్రీ హటంగఢి ఇవాళ్టి మన జనగళం ‘ఇన్స్పైరింగ్ 30’ కార్యక్రమం ప్రత్యేక అతిథి.