క్రీడలుజాతీయంతాజా వార్తలు

వ్యాక్సినేషన్ ఫొటో – చిక్కుల్లో కుల్దీప్

అతిథి గృహంలో వ్యాక్సిన్ తీసుకున్న ఘటనపై విచారణకు ఆదేశం

కాన్పూర్: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో అతని వ్యవహార శైలి కాన్పూర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆగ్రహం తెప్పించింది. 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా తీసుకోవాలని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌, స్థానిక గోవింద్‌నగర్‌లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రిలో కాకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం అతిథి గృహంలో టీకా తీసుకున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోను కుల్దీప్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటో కాన్పూర్ జిల్లా అధికారుల కంట పడడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్‌ వ్యవహరించిన తీరు వారికి ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనపై కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అలోక్‌ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌లో కుల్దీప్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button