ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
షర్మిల తనయుడి వివాహం ఇక్కడే! – Ys Sharmila Son Raja Reddy Marriage Ceremony at Jodhpur
రాజస్థాన్ లో మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహ మహోత్సవం
ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తనయుడి వివాహ మహోత్సవం రాజస్థాన్ లో అట్టహాసంగా జరగనుంది. జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ లో ఈ నెల 17న జరగనున్న వివాహ వేడుక ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు రాజారెడ్డి వివాహ సందడితో ఉమైద్ భవన్ కళకళలాడనుంది. రాజా రెడ్డి, అట్లూరి ప్రయల వివాహ వేడుకకు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. 16వ తేదీన సంగీత్, మెహందీ… 17వ తేదీ సాయంత్రం వివాహ మహోత్సవం ఉంటుంది. 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు, సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల కార్యక్రమాలు జరుగుతాయి.