మీ ఓటును కనుగొనండి… చాలా సులువుగా !
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని, ప్రజాస్వామ్య బద్ధంగా తమను పాలించే పాలకులను ఎన్నుకోవాలని ప్రతి ఒక్క పౌరుడు తహతహలాడుతున్నాడు. అయితే, ఇటీవల ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని, ఓట్లు గల్లంతు అయ్యాయని వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ ఓటు ఉందా, లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే మీరు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు కాగలుగుతారు. మీ పేరు ఆ జాబితాలో ఉందా లేదా అనే విషయాన్ని నివృత్తి చేసుకునేందుకు ఈసీఐ ఆన్ లైన్ పోర్టల్స్ ను అందుబాటులో ఉంచింది. వాటిని మీరు సరిగ్గా వినియోగించుకుంటే కనీసం ఓటరు ఐడీ కార్డు లేకున్నా సరే మీ ఓటును గుర్తించవచ్చు. ఈ ప్రక్రియపై జనగళం ప్రత్యేకమైన వీడియోను మీకు షేర్ చేస్తోంది. వెంటనే కిందన ప్రొవైడ్ చేసిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీ ఓటు హక్కును చకచకా చెక్ చేసుకోండి… జనగళం ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.