పవన్ పర్యటన వాయిదా – కారణం తెలిస్తే షాక్ అవుతారు ! Pawan Kalyan Election Tour in Godavari Districts Postponed
పవన్ కల్యాణ్ హెలికాప్టర్ దిగడానికి నో పర్మిషన్ - No Permission for Pawan Helicopter to Land in Godavari Districts
వైఎస్ జగన్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పర్యటనలకు అవాంతరాలు కల్పిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరగాల్సిన పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడింది. జనసేనాని హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రదేశాల్లో నిర్వహించే సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ దిగేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వని కారణంగా పర్యటన వాయిదా పడినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. అనుమతులు ఇచ్చే విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఆర్ అండ్ బి అధికారులు అనుమతులు ఇవ్వకుండా సాకులు చెబుతున్నారు. భీమవరంలో ఇబ్బందులు కల్పించారని అన్నారు. కాకినాడలో హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదన్నారు. అవాంతరాలు కలిగిస్తున్నందున పర్యటన వాయిదా వేశామన్నారు. ప్రభుత్వ ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన పవన్ కల్యాణ్ తదుపరి సమావేశాలను మంగళగిరి కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు.