ఆంధ్రప్రదేశ్ముఖ్యాంశాలురాజకీయం
రుషికొండ ప్యాలెస్ తో నారా లోకేష్ సెల్ఫీ
అవినీతి అనకొండా... నువ్వు మింగిన కొండలు, వేల కోట్లు కక్కిస్తాం
శంఖారావంలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రుషికొండ పరిసర ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన లోకేష్ అక్కడ సెల్ఫీ దిగారు. రుషికొండపై జరిగిన నిర్మాణాలను చూపిస్తూ లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. తుపాన్ల ప్రభావం నుంచి విశాఖకు రక్షణ గోడలా నిలిచే రుషికొండను జగన్ అనే అవినీతి అనకొండ మింగేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. 9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడు జగన్ అంటూ రూ. 500కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరో ప్యాలెస్ ను చూడండి అంటూ సెల్ఫీ దిగారు. అవినీతి అనకొండా… నువ్వు మింగిన కొండలు, వేల కోట్లు కక్కిస్తాం అంటూ జగన్ కు హచ్చరిక చేశారు లోకేష్.