ఆంధ్రప్రదేశ్ముఖ్యాంశాలురాజకీయం
వాలంటీర్ల జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్ – Tdp Anitha on Jagan Meeting with Volunteers
మీ భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోగన్ రెడ్డి ‘వాలంటీర్లకు వందనం’ సభపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వీడ్కోలు సభలా ఉందంటూ ఎద్దేవా చేశారు. చాలీచాలని జీతాలతో చదువుకున్న యువత భవిష్యత్తును వాలంటీర్ ఉద్యోగాల పేరిట జగన్ నాశనం చేశారని అనిత మండిపడ్డారు. తనను మళ్లీ గెలిపించేందుకు వాలంటీర్లు సిద్ధం కావాలంటూ జగన్ వేడుకోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా చేసిన విధ్వంసాన్ని ప్రజలంతా అర్థం చేసుకున్నారన్న అనిత వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు.